విమానం ఓ కరెంట్ పోల్ ఢీకొన్న గటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో.. ప్రయాణికులతో ఎస్‌జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది.. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్‌ను తాకింది.. స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఆ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులను విమానం నుంచి దింపి, మరో విమానంలో జమ్మూకు పంపించినట్టు అధికారులు వెల్లడించారు.. మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ఇక, ఈ సంఘటన తర్వాత, స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, పుష్ బ్యాక్ సమయంలో, కుడి వైపు రెక్క వెనుక అంచు ఒక పోల్‌ను తాకిందని.. స్వల్ప నష్టం జరిగిందన్నారు.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Read Also: Anand Mahindra: ఫన్నీ వీడియోతో బిజినెస్ పాఠాలు.. అసలైన టీమ్ వర్క్ ఇదే..