Pocharam Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని సభాపతి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం వ్యవసాయ కళాశాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొంటారు.
సెంబ్లీ అమ్మవారి ఆలయంలో తన జన్మదినం సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. అన్నికంటే ముఖ్యమైనది మానవ జన్మ. ఎవరైతే భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఆధారంగా కానీ చేప్పే ముఖ్యమైన సందేసం ఒక్కటే ఈ జన్మలో మనం మంచి పనులు చేసి ఇతరుల మనసు నొప్పించకుండా, మోసం చేయకుండా..
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.. లేకుంటే చర్యలు తప్పవంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతోంది అధికార పార్టీ.. స్పీకర్ మరమనిషిలా నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల రాజేందర్ స్పీకర్ ను కోరారు. స్పీకర్ ను మరమనిషిలా నిర్ణయం తీసుకోవద్దని చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈనేపథ్యంలో.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతుందన్నారు. రాష్ట్ర సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978-1983, 1983-84 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని తెలిపారు. ఇక 1945…
Pocharam Srinivas Reddy comments on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు తెలంగాణలో కాకాపుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సీతారామన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తాజాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను బన్సువాడ ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా మీ ముందుకు వచ్చానని.. స్పీకర్ హోదాలో మాట్లాడటం లేదని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ నాకు…
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు….జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాట్టు చేసిన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తన విజ్జప్తిపై వెంటనే ముఖ్యంమంత్రి స్పందించి జీవో ఇచ్చారు…
యువత మేలుకో దేశాన్ని ఏలుకో అన్న సూక్తిని నిజం చేస్తున్నాడు ఆగ్రామ సర్పంచ్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు..అనే మంచి మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఆగ్రామ ప్రథమ పౌరుడు. అభివృద్ధి నూతన పంథాలో సాగాలంటే నేటి యువత రాజకీయాల్లోకి రావాలి అనే మాటకు వాస్తవ రూపంగా నిలిచాడు. గ్రామంలో సౌరవెలుగులు నింపుతూ గ్రామానికే దిక్సూచిగా, పలువురికి మార్గదర్శిగా మారాడు అంకోల్ క్యాంప్ సర్పంచ్ . అంకోల్ క్యాంప్ సర్పంచ్…
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి..…
తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం కాన్వాయ్ ల్లోని పోలీసు వాహనం ఢీకొని దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడానికి స్పీకర్ పోచారం హైదరాబాద్ నుండి బాన్సువాడకు వెళ్ళుతున్న సమయంలో మేడ్చల్ సమీపంలోని కాళ్ళకల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాద సమయంలో స్పీకర్ పోచారం వేరే వాహనంలో సంఘటన స్థలానికి దూరంగా ఉన్నాట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తక్షణమే.. బాధితునికి వైద్య సహాయం…