తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం కాన్వాయ్ ల్లోని పోలీసు వాహనం ఢీకొని దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడానికి స్పీకర్ పోచారం హైదరాబాద్ నుండి బాన్సువాడకు వెళ్ళుతున్న సమయంలో మేడ్చల్ సమీపంలోని కాళ్ళకల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాద సమయంలో స్పీకర్ పోచారం వేరే వాహనంలో సంఘటన స్థలానికి దూరంగా ఉన్నాట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తక్షణమే.. బాధితునికి వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ పోచారం. అయితే.. ఆస్పత్రి కి చేరేలోపే ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనపై పోచారం దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.