Pocharam Srinivas Reddy comments on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు తెలంగాణలో కాకాపుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సీతారామన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తాజాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను బన్సువాడ ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా మీ ముందుకు వచ్చానని.. స్పీకర్ హోదాలో మాట్లాడటం లేదని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం అని ఆయన అన్నారు. మాకు కొత్తగా పథకాలు ఇస్తారేమో అని అనుకున్నానని.. కేంద్రమంత్రి వస్తే వరాలు కురిపిస్తారని అనుకున్నాని ఆయన అన్నారు.
నా నియోజకవర్గంలో మాట్లాడారు కాబట్టి నేను స్పందిస్తున్నానని పోచారం అన్నారు. కోల్డ్ స్టోరేజి కావాలని మంత్రిని కలిశానని.. ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. మా అక్క మా బాన్సువాడను సెలెక్ట్ చేసుకుని వచ్చారని అన్నారు. ప్రజల కోసం మంచి పథకాలను తీసుకురండి మేము హర్షిస్తామని అన్నారు. తమరు వచ్చారు.. ఇంకోసారి కూడా రావాలి.. మాకు వరాలు ఇవ్వాలి.. ఆర్థిక సహాయం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు.
Read Also: Brahmastra Pre Release Event: చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే!
నేను పశు సంవర్థక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్సీడీఎస్ ద్వారా అప్పు తెచ్చుకుని గొర్ల కాపారులకు గొర్లను ఇచ్చామని..దీంట్లో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. చేపల పంపిణీకి కేంద్రం నిధులు ఇస్తుందని మాట్లాడారు.. ఇది కూడా అబద్ధం అని..ఎన్సీడీ అనేది అప్పులు ఇచ్చే సంస్థ అని అన్నారు పోచారం. రైతు ఆత్మహత్యలపై నిర్మలా మాట్లాడారు.. రైతుబంధు పథకం మొదలై, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని.. చివరి గింజ వరకు కొంటున్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు తగ్గినయి అని ఆయన అన్నారు. దేశంలో అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన అన్నారు.
కౌలు రైతుల గురించి మాట్లాడారు.. కౌలు రైతులు ప్రతీ ఏటా మారుతూ ఉంటారని ఆయన తెలిపారు. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన కౌలు రైతులకు ఇస్తున్నారా..? అని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం కట్టుకుంది.. నీతి ఆయోగ్ డబ్బులు ఇవ్వాలని చెప్పినా.. కేంద్ర ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో మీ వాటి ఉందని.. అంతా మీదే కాదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం పెరిగిందని..2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని..ఏది అని ప్రశ్నించారు. బియ్యం పథకంలో మొత్తం మీరు ఇవ్వట్లేదని.. దీంట్లో కేంద్రానిది, రాష్ట్రానిది సగం సగం వాటా ఉందని పోచారం అన్నారు. మేము ఎక్కడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదని.. ఆడపడచు వచ్చిందని గౌరవించాం అని పోచారం అన్నారు.