పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ దిశగా పోలీసులు చర్యలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను పోలీసులు విచారించారు. ఆయన రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయాను అంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయపాల్ కి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎస్పీ ఏఆర్…
యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు.. తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ ఓ యువతి గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యువతి శాంతించింది.
సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమురంభీం జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత రెండు రోజులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. ఐదేళ్ల తర్వాత జిల్లాకు వస్తుండడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌కు రానున్న సీఎం కేసీఆర్ తొలుత కొమురం భీం చౌక్‌కు చేరుకుని.. అక్కడ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు నివాళులర్పిస్తారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం
KCR: నేడు నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో రూ.53 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయాలతో పాటు దేశిఇటిక్యాల శివారులో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ జిల్లాకేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు.