దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలను వివరించారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులు. జనవరి 15 లోపు డీపీఆర్ లు కేఆర్ఎంబీకి సమర్పించాలని..డీపీఆర్ ల ఆధారంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం. ఏపీకి తెలంగాణ రూ.6015…
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల హోంమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు…
తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్‌బకాయిలు,…