ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్‌లో ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో స్వతంత్ర ఆస్తిని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన నివాసం ఇదే కావడం విశేషం. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు.
Bombay High Court: ఇండియాలో న్యాయపరమైన కేసులు కోర్టుల్లో దశాబ్దాలు కొనసాగుతుంటాయి. చివరకు విజయం మాత్రం దక్కుతుంది. బాధితులు న్యాయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని సార్లు ఉంటుంది. అటువంటి కోవలోకే చెందుతుంది ఓ మహిళ పోరాటం. పది కాదు 20 కాదు ఏకంగా తన ఆస్తిని దక్కించుకోవడానికి 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. చివరకు 93 ఏళ్ల వయసులో ఆమెకు న్యాయం దక్కింది.
ఆర్థిక రాజధాని ముంబాయిలో ఇకనుంచి సరికొత్త రవాణాకు మహారాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైలు, బస్, విమానాలతో పాటు నాలుగో రవాణా సదుపాయంగా వాటర్ టాక్సీ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ప్రణాళికలను మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాటర్ ట్యాక్సీలను మూడు ఆపరేటర్ సంస్థలు నిర్వహించనున్నాయి. దక్షిణ ముంబయి నుండి నవీ ముంబయి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వాటర్…