ముంబాయిలో అందుబాటులోకి రానున్న వాటర్ ట్యాక్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబాయిలో ఇకనుంచి సరికొత్త రవాణాకు మహారాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైలు, బస్, విమానాలతో పాటు నాలుగో రవాణా సదుపాయంగా వాటర్ టాక్సీ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ప్రణాళికలను మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాటర్ ట్యాక్సీలను మూడు ఆపరేటర్ సంస్థలు నిర్వహించనున్నాయి. దక్షిణ ముంబయి నుండి నవీ ముంబయి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వాటర్ టాక్సీ సర్వీసుల లక్ష్యమని ఒక నివేదికలో పేర్కొంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో గమ్య స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపింది. సుమారు 30 కి.మీల మధ్య ప్రయాణాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.
అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఎలిఫెంటాతో సహా డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ (డిసీటీ) నుంచి రేవాస్, ధర్మతార్, కరంజాడే, డీసీటీ నుంచి బేలాపూర్, బేలాపూర్, నెరుల్, ఐరోలి, వాషి, ఖండేరి దీవులకు పలు రూట్‌లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపింది. నగరంలోని ప్రధాన వాణిజ్య జిల్లా అయిన నవీ ముంబయి నుండి సౌత్‌కి అధిక సంఖ్యలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాటర్ టాక్సీలను నడపనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ముంబయి నుండి నవీ ముంబయికి రైలు మినహా మరే ఇతర రవాణా ప్రత్యామ్నాయం లేదని, దీంతో వాటర్ టాక్సీలు స్థానిక రైలు సర్వీసులపై భారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా పనిచేస్తాయని తెలిపింది. డీసీటీ నుంచి నవీ ముంబయికి ఒక్కో ప్రయాణికుడు రూ.1200 నుండి రూ. 1500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే జెన్‌పిటికి సుమారు రూ. 750 ధర ఉంటుంది. భారీ వర్షాల సమయంలో కాకుండా ఏడాది పొడవునా ఈ ట్యాక్సీలను అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!