Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
- ముంబైలో ఖరీదైన ఇల్లు కొలుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
- 500 కోట్లతో ఇల్లు కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్ ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో ఆస్తిని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన నివాసం ఇదే కావడం విశేషం. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు.
యోహాన్ పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. పూనావాలా పేరుపై అనేక కంపెనీలు ఉన్నాయి. ఇతని తండ్రి జవరాయ్ పూనావాలా కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్త. ప్రముఖ టీకా తయారీదారు అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సహ-స్థాపించారు. ఇక యోహాన్ పూనావాలా భార్య మిచెల్ కూడా ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె డిజైన్ సంస్థ నిర్వహిస్తున్నారు.
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
తాజాగా కొనుగోలు చేసిన భవనంలో విశాలమైన లేఅవుట్ ఉంది. విశాలమైన డాబాలు, బహుళ అంతస్తులు కలిగి ఉంది. విలాసవంతమైన సెట్టింగ్, విస్తృతమైన కళాఖండాలు ఉన్నాయి. మిచెల్ పూనావాలా యొక్క ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్‌లు మరియు ఇతర విలువైన మొక్కలు ఉన్నాయి. నివాసంలో కొంత భాగాన్ని ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు.
దక్షిణ ముంబైలో ఇటీవల సెలబ్రిటీల ఆస్తుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ కూడా ఈ ప్రాంతాల్లోనే ఇళ్లులు కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ ‘ఓంకార్ 1973’ ప్రాజెక్ట్‌లో రూ. 34 కోట్లకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్‌లో రూ. 30 కోట్ల ఆస్తిని సంపాదించారు. యువరాజ్ సింగ్ కూడా అదే పరిసరాల్లో రూ 64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు. అలాగే చలనచిత్ర నిర్మాత, దర్శకుడు దినేష్ విజన్ కూడా దక్షిణ ముంబైలోని ప్రముఖ ఆస్తి యజమానుల జాబితాలో చేరారు. 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్‌లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 12.91 కోట్లకు కొనుగోలు చేశారు. అలియా భట్ యొక్క ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 37.80 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇలా సెలబట్రీలంతా ఖరీదైన ఇల్లులను కొనుగోలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!