వివాదాలు, అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్‌ను విడిచి పారిపోయారు వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. అయితే, సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారని.. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన.. దానికి ‘కైలాస’ అనే పేరు పెట్టుకున్నారు.. తమది ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు.. ప్రత్యేక కరెన్సీ కూడా తయారు చేశారు. తమ దేశంలో అడుగుపెట్టాలంటే వీసా ఉండాల్సిందేనని ప్రకటించారు.. అయితే, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఆయనపై విశ్వాసం వ్యక్తం…
సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ సంగీత సజిత్ (46) కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆదివారం తిరువనంతపురంలోని తన సోదరి నివాసంలో కన్నుమూశారు. సంగీత కొద్దిరోజులుగా తన సోదరి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన 46 ఏళ్ల సంగీత సజిత్ తమిళ్, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో సుమారు 200 పాటలు పాడారు. Mitraaw Sharma: ‘బిగ్‌బాస్’ నాకు అది…
ఏపీలోని శ్రీసిటీలో భారీ పరిశ్రమ కొలువుదీరనుంది. జపాన్ ప్రపంచ నంబర్‌వన్ ఏపీ కంపెనీ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సంస్థకు దేశంలోనే ఇది మూడో ప్లాంట్ కాగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం మొదటిది కావడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు డైకిన్ సంస్థ వెల్లడించింది. భారీ…
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…
తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ర్టాల సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపో వడం చర్చనీయాంశం అయింది. అతి ముఖ్యమైన ఈ సమావే శానికి కేసీఆర్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ర్టాల సాగునీటి ప్రాజెక్టులు, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలపై ముఖ్యంగా చర్చించనున్నారు. దక్షిణాది రాష్ర్టాల నుంచి అందరూ సీఎంలు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ స్థానంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్…
చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు…
ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులకు నెలవైంది. ఏ హీరో బర్త్ డే జరిగినా… ఏదైనా ఈవెంట్ జరిగినా ఆ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ను ఎంత…
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదలై రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇక పుట్టిన రోజున సినీ రాజకీయరంగ ప్రముఖుల శుభాకాంక్షలతో తడిచి ముద్దయ్యాడు మహేశ్. అదే రోజు సాయంత్ర ఏడు గంటలకు ట్విట్టర్ స్పేసెస్ లో లైవ్ సెక్షన్ నడిచింది. మహేశ్ టీమ్ నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేశ్ తో పని చేసిన దర్శక, నిర్మాతలు ,…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని,…