Priya Anand: నిత్యానందపై మనసు పారేసుకున్న హీరోయిన్.. ఆయన్ని పెళ్లి చేసుకుంటా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాలు, అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్‌ను విడిచి పారిపోయారు వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. అయితే, సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారని.. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన.. దానికి ‘కైలాస’ అనే పేరు పెట్టుకున్నారు.. తమది ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు.. ప్రత్యేక కరెన్సీ కూడా తయారు చేశారు. తమ దేశంలో అడుగుపెట్టాలంటే వీసా ఉండాల్సిందేనని ప్రకటించారు.. అయితే, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఆయనపై విశ్వాసం వ్యక్తం చేసేవారు, మనసు పారేసుకునేవారు, ఆయన అంటే పడి చచ్చిపోయేవారు కూడా ఉన్నారట.. అప్పట్లో ఓ హీరోయిన్‌తో ఆయన గడిపిన ఏకాంత గడియలకు సంబంధించిన వీడియో సంచలనం సృష్టించగా.. ఇప్పుడు నిత్యానందుడిపై మరో హీరోయిన్ మనసుపారేసుకుంది.. అంతేకాదు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టేసింది..
Read Also: Marburg Virus: ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్.. ఇప్పటికే ఇద్దరు మృతి
Also Read
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ప్రముఖ నటి ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ ప్రియా ఆనంద్.. సౌత్ ఇండియన్ సినిమాలో పాపులర్ నటీమణులలో ఆమె ఒకరు. తమిళం, తెలుగు, హిందీ వంటి పలు భాషా చిత్రాల్లో నటించారు. 2009లో నటుడు జై నటించిన “వామనన్” చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె.. పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.. తెలుగులోనూ అమ్మడికి మంచి ఫాలోయింగే ఉంది.. అటు తమిళ, ఇటు తెలుగు యువత మనసు దోచుకుంది. ఆమె చివరిసారిగా ఆర్జే బాలాజీ నటించిన ఎల్‌కేజీ చిత్రంలో ప్రియా ఆనంద్ నటించారు.. ప్రస్తుతం అందగన్, సుమో, కాసేతన్ కోడులౌడా వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. తన పెళ్లి ప్రస్థావన వచ్చింది.. దీంతో, నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తమన మనసులోని మాటను బయటపెట్టింది.. ఆయన గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా.. వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి నిత్యానందస్వామి అంటూ ప్రశంసలు కురిపించింది.. అంతేకాదు, ఆయన్ని పెళ్లి చేసుకుంటే తనకు పేరు మార్చుకోవలసిన అవసరం కూడా ఉండదంటూ ఫన్నీ కామెంట్లు చేసింది.. మొత్తంగా.. ఈ కామెంట్లతో ప్రియా ఆనంద్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
తాజావార్తలు
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
-
Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!