South Coastal Zone: ఆంధ్రప్రదేశ్‌కు షాక్ ఇచ్చింది రైల్వేశాఖ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్త మెలిక పెట్టింది. సెంటిమెంట్‌ను గౌరవించి 130 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్ కొనసాగిస్తూనే.. కీలక మార్గాలలో కోత పెట్టింది. కార్గో, అరకు పర్యాటక అభివృద్ధికి కీలకమైన కొత్త వలస – కిరండోల్ మార్గం ఒడిషా పరిధిలోకి వెళ్ళిపోనుంది. KK లైన్ ను వాల్తేర్ నుంచి విడగొట్టి నూతనంగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్ పరిధిలోకి తీసుకుని వచ్చారు. అలాగే, ఉత్తరాంధ్ర పరిధిలోని ఇచ్ఛాపురం సహా పలు స్టేషన్లు వాల్తేరు కోల్పోయింది. వాస్తవానికి వాల్తేరు రైల్వే డివిజన్ కు కిరండోల్ ల్కెన్ గుండెకాయ లాంటిది. ఏడాదికి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం కిరండోల్ లైన్ ద్వారానే వస్తోంది.
Read Also: Naga Chaitanya: ‘తండేల్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ.. ఎమోషనల్ హై ఇస్తుంది: నాగచైతన్య
ఇక, రాయగడ కేంద్రంగా డివిజన్ అనేది చాలా కాలంగా ఒడిశాలో వున్న పొలిటికల్ డిమాండ్. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మేలు జరిగే ఏర్పాట్లు అక్కడ నాయకత్వం చేసుకుని సక్సెస్ అయింది. కానీ, ఇందులో భాగంగానే విశాఖకు 20 కిలోమీటర్ల దూరంలోనూ… దాదాపు 150 కిలో మీటర్లు ఆంధ్రాలో ప్రయాణిస్తున్న కొత్తవలస – బచేలీ రూట్ రాయగడ డివిజన్‌ను తన్నుకుపోయారు. టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. దేశ, విదేశాల నుంచి పర్యాటకుల నిత్యం వస్తూనే వుంటారు. అలాంటి అరకును.. రాయగడ డివిజన్‌లో కలిపేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి భారీ లబ్ధి చేకూర్చామని చెబుతూ వచ్చిన కేంద్రం.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూనే.. కొత్త మెలిక పెట్టడంపై ఇప్పుడు చర్చగా మారింది..