వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్‌లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి.
Chinese Sailors Attack: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆర్మీ రెచ్చిపోతోంది. చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను భయపెడుతోంది.
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నౌవి, వైమానిక విన్యాసాలను ఇవాళ (ఆదివారం) నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
Jaishankar: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా దుందుడుకు వేషాలు ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో సర్వాధికారాలు మావే అంటూ ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను చైనా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల రెండు సందర్భాల్లో ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా కోస్టుగార్డ్స్ నౌకలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతంతో మిత్రదేశం ఫిలిప్పీన్స్‌కి అండగా నిలుస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. చైనా వైఖరిని…
South China Sea: దక్షిణ చైనా సముద్ర విషయంలో సరిహద్దు దేశాలను చైనా తన బలాన్ని చూసుకుని కవ్విస్తోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను బెదిరించేందుకు ప్రయత్నిస్తోంది. దురాక్రమణవాదంతో భయపెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
Japan deploying long-range missiles to counter China: నిత్యం చైనా, నార్త్ కొరియాల నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ధీటుగా.. తమ సార్వభౌమాధికారాన్ని, తన భూభాగాలను రక్షించుకోవడానికి.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధం అవుతుంది. ముక్యంగా జపాన్ సరిహద్దుల్లో ఉన్న చైనా, నార్త్ కొరియాలే లక్ష్యంగా క్షిపణులను మోహరిస్తోంది. దాదాపు 1000 దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను మోహరించే ఆలోచనలో జపాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
నడి సముద్రంలో ఓ ఓడ రెండు ముక్కలైపోయింది.. ఈ ప్రమాదంలో 30 మంది సిబ్బంది గల్లంతయ్యారు.. అయితే, గల్లంతైన వారి కోసం వందలాది పడవలు, ఫిషింగ్ ఓడలు రంగంలోకి దిగి ఆపరేషన్ నిర్వహించడం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
దక్షిణ చైనా సముద్రంలో చైనా దేశం ఆదిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ జలాల పరిధిలోని దీవులు, దేశాలు తమవే అని వాదిస్తోంది. తైవాన్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తైవాన్‌కు రక్షణ కల్పించేందుకు అమెరికా ఆ దేశానికి సమీపంలో గువామ్ నావికాదళాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్ ఈ జలాల్లో పహారా కాస్తుంటుంది. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాటీయ జలాల్లోకి ప్రవేశించే సమయంలో ఈ జలాంతర్గామి ప్రమాదానికి గురైంది.…