Pakistan – Afghanistan Conflict: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కోర్టు భవనం వెలుపల ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిని ఆత్మాహుతి దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనిని యుద్ధ ప్రకటనగా అభివర్ణించారు. ఈ దాడికి ఆయన ఆఫ్ఘనిస్థాన్‌ను నిందించారు. ఈ దాడికి పాకిస్థాన్ తాలిబన్ (TTP) బాధ్యత వహించిందని వార్తలు రావడంతో, రెండు దేశాల మధ్య…
India Warns Pakistan: దాయాది దేశానికి భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ యుద్ధంలో ఇండియా తాలిబన్లకు బాసటగా నిలిచింది. తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇండియా.. ఆఫ్ఘన్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తుందని, ఇప్పటి వరకు వాటిపై సమర్థంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన వెల్లడించారు. దాయాది దేశం తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం…
Khawaja Asif:గత కొద్ది రోజులగా పాక్- ఆఫ్ఘన్ మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు మరణించారు. పాకిస్థాన్‌కి చెందిన సైనికులు తమకు లొంగిపోయారని ఆఫ్ఘనిస్థాన్ చెబుతోంది. అయితే.. ఈ యుద్ధంపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ భారతదేశంపై వింత వాదనను చేశారు. న్యూఢిల్లీ(భారత్) తాలిబాన్లను స్పాన్సర్ చేస్తోందని, పాకిస్థాన్‌పై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై…
Donald Trump: భారత్- అమెరికా మధ్య గత 25 సంవత్సరాలుగా సంబంధాలు క్రమంగా పటిష్టం అవుతున్నాయి. కానీ, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. భారత్ నుంచి వెళ్తున్న డబ్బును ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని పలుమార్లు ఆయన ఆరోపించారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తక్షణమే…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.