Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో "జమాత్ ఉల్ ముమినాత్" పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం "జమాత్ ఉల్-ముమినత్" కోసం నియామకాలను…
Pakistan: పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతున్నారు పాక్ తాలిబాన్లు. తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఖైబర్ జిల్లాలో జరిగింది. తిరా ప్రాంతంలోని హైదర్ కందావో సైనిక పోస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడికి పాల్పడినట్లు ప్రకటించాయి.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.
భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. మనదేశంలోని అనేక నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. ఈ దాడులను భారత రక్షణ దళం తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా బైకర్ YIHA-III కామికేజ్ డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలనుకుంది పాకిస్థాన్.
Omar Abdulla : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “భారత సరిహద్దులపై పాకిస్తాన్ షెల్లింగ్ చేయడానికి IMF డబ్బులు తిరిగి చెల్లిస్తోందా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ఒమర్ అబ్దుల్లా చేసిన పోస్ట్ సంచలనం రేపింది. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలో శాంతిని ఎలా ఆశిస్తున్నాయని ఆయన నిలదీశారు. “పూంచ్,…
India Pak War : భారత్ జరిపినట్లుగా చెబుతున్న తీవ్రమైన సైనిక దాడుల నేపథ్యంలో భారత్ , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పరిణామాలపై తక్షణమే స్పందించిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ అత్యవసర ఉన్నత స్థాయి భద్రతా సమావేశానికి పిలుపునిచ్చారు. పరిస్థితిని అంచనా వేసి, తదుపరి చర్యలను నిర్ణయించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అనూహ్యమైన పరిణామం దౌత్య వర్గాల్లో కలకలం రేపింది, అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల…