పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయసభలు మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో రెండు సభలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. "అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ." అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు దానిని భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Sonia Gandhi: లోక్సభ ఎన్నికలకు ముందు బెంగళూరులో బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి 26 పార్టీల నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కూడా సోమవారం బెంగళూరు చేరుకున్నారు.
తనను కలవడానికి వచ్చిన మహిళా రైతులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉత్సాహంగా గడిపారు. వారితో కలిసి భోజనం చేసిన సోనియా.. అనంతరం వారితో కలిసి హుషారుగా డ్యాన్స్ కూడా చేశారు.
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
Lok Sabha Election: రాజకీయాలలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడల్లా తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల కుటుంబాలు తమ కంచు కోటలను పదిలం చేసుకుంటాయి. రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతున్నాయి.