Asaduddin Owaisi: కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు, రేపు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మాజీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ తరుపు నుంచి హుబ్బళి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. ఆయన కోసం సోనియా గాంధీ శనివారం ప్రచారం చేశారు.
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అన్న పార్టీలు ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని పోరాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
హర్యానాలోని ప్రముఖ వాద్రా ల్యాండ్ డీల్ కేసులో కొన్నేళ్ల విచారణ తర్వాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలకు క్లీన్ చిట్ లభించింది. భూ బదలాయింపులో ఎలాంటి ఉల్లంఘన జరిగినట్లు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించలేదు.
నర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు.
Congress Files: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దీంతో పాటు వరసగా ప్రధాన రాష్ట్రాలు అయిన కర్ణాటక, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం రావడంతో గురువారం ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో ఆ పార్టీ ఆదివారం నాడు స్పష్టత ఇచ్చింది.