పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖపై ప్రభుత్వం స్పందించింది. కాంగ్రెస్ సంప్రదాయాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు భారత్ గా మార్పు, మహిళా రిజర్వేషన్ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌లోని సభ్యులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తున్నారు.
Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రశ్నోత్తరాల సమయం లేకుండా కేంద్రం ఉభయసభల సమావేశానికి పిలుపునిచ్చింది.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం పాలయ్యారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో ఢిల్లీలోని సర్ గంగారమ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు పరీక్షలు జరిపారు, ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు.
Sonia Gandhi: ముంబై వేదికగా ఈ రోజు, రేపు జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీ ఇద్దరూ హజరుకానున్నారు. వీరు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. వీరికి ఆహ్వానం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఎయిర్ పోర్టు ముందు గుమిగూడారు.
ఆగస్టు 31న ముంబయిలో ప్రతిపక్ష 'ఇండియా కూటమి' మూడో సమావేశం జరగనుంది. ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన భారత కూటమి.. మూడో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. సీట్ల పంపకాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ కోసం అందరూ పోరాటం చేశారు అని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకి స్వాతంత్రం ఇచ్చారు.. కేసీఆర్ పార్టీ బలం ఎంత అప్పుడు.. సోనియా వల్లనే తెలంగాణ వచ్చింది.. ఒక్క వ్యక్తి ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకుంటున్నారు అని ఆయన అన్నారు.