కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ లో తండ్రి కూతురు దారుణ హత్యకు గురైయ్యారు. ఇంటి అల్లుడే తండ్రి-కూతురు గొంతు కోశాడు. మృతులు తండ్రి ఓదెలు, కూతురు లావణ్యగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు.