దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ తల్లిదండ్రులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు సీఎం మౌనం పాటించారు. ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో వీర సైనికుడు…