Jupiter: గురుగ్రహాన్ని ఢీకొట్టిన ఖగోళ శకలం.. భారీ విస్పోటనం.. ఈ వీడియో చూడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupiter: సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం గురుగ్రహం. దాదాపుగా 1300 భూమిలను తనలో ఇముడ్చుకోగలదు. సూపర్ గ్యాస్ జాయింట్ అయిన గురుగ్రహం సౌరకుటుంబంలో ‘వాక్యూమ్ క్లీనర్’గా పనిచేస్తుంటుంది. తన అపారమైన గురుత్వాకర్షణ శక్తితో గ్రహశకలాలను, తోకచుక్కలను తనవైపు ఆకర్షిస్తుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఖగోళ శకలం గురు గ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో గ్రహంపై భారీ విస్పోటనం ఏర్పడినట్లు కనిపించింది. ఆగస్ట్ 29 (ఆగస్టు 28న 1645 GMT) సమయంలో ఓ గుర్తుతెలియన ఓ ఖగోళ వస్తువు గురుగ్రహాన్ని ఢీకొట్టిన ఘటన ఆర్గనైజ్డ్ ఆటోటెలీస్కోప్‌లు ఫర్ సెరెండిపిటస్ ఈవెంట్ సర్వే (OASES) ప్రాజెక్ట్ మరియు ప్లానెటరీ అబ్జర్వేషన్ కెమెరా ఫర్ ఆప్టికల్ ట్రాన్సియెంట్ సర్వేస్ (PONCOTS) సిస్టమ్ ఈ ఖగోళ దృశ్యాన్ని గుర్తించాయి. వీటి ట్విట్టర్ అకౌంట్ లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
Read Also: Oxygen-28: ఆక్సిజన్ కొత్త రూపాన్ని కనుగొన్న సైంటిస్టులు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
గురుగ్రహం గ్రహశకలాలు ఎక్కువగా తిరిగే ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి దగ్గరగా ఉంది. ఏదైనా గ్రహశకలం తన మార్గం నుంచి పక్కకు తప్పుకున్న వెంటనే ఈ భారీ గ్యాస్ జాయింట్ తన గురుత్వాకర్షణతో తన వైపు లాగేసుకుంటుంది. 1994లో షూమేకర్ లేవీ 9 అనే తోకచుక్క ఇలాగే బృహస్పతిని ఢీకొట్టింది. ఈ తాకిడి వల్ల గురుడి ఉపరితలంపై పెద్ద వెలుగు కనిపించింది. దీన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. గురు గ్రహం భూమితో పాటు అంతర సౌరకుటుంబంలోని గ్రహాలను కాపాడుతుంది. ఒక వేళ గురుగ్రహమే లేకుంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోని గ్రహశకలాలు దారి తప్పి భూమి వైపు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది.
NEWS 🚨: Astronomer captures an asteroid or large object hitting Jupiterpic.twitter.com/7Kvf6MNruQ
— Latest in space (@latestinspace) August 31, 2023
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!