ఢిల్లీ బాంబ్ పేలుడు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ప్రశాంతంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు బ్లాస్ట్ అయింది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు.
Namaz In Temple: తమిళనాడులోని తిరుప్పూర్, కరువంపాలయం ప్రాంతంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రాజ గణపతి దేవాలయంలోకి ప్రవేశించిన ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేయడం తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తిరుప్పూర్-మంగళం రోడ్డులోని సెంగుంతపురం వద్ద ఉన్న రాజ గణపతి దేవాలయంలో గత ఆదివారం (అక్టోబర్ 26) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పూచుకాడ్ నివాసి అయిన అజ్మల్ ఖాన్ (21) అనే యువకుడు ఆలయంలోకి వచ్చి.. అక్కడ భక్తులు ఉన్నప్పటికీ,…
Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్…
'కల్కి-2' మూవీపై తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించాల్సిందిగా మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, టాలీవుడ్ వర్క్ కల్చర్, ఆలియాకి బాగా సుపరిచితమే కాబట్టి.. సుమతి రోల్కి ఆమె సరిగ్గా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ అండ్ టీమ్ భావిస్తున్నారట.
IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది.
Story Board: సోషల్ మీడియా శృతిమించిపోతోంది. వ్యక్తులు, సంస్థలు.. ఆఖరికి వ్యవస్థల్ని కూడా దాటేసి..ప్రభుత్వాలకూ తలపోటుగా తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్న వారికి వార్నింగులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసింది. తెలంగాణలో సోషల్ మీడియా హద్దుదాటిన వారిపై రౌడీషీట్లు తెరవాలనే ఆదేశాలు వచ్చేశాయి. అటు ఏపీలో కూడా సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టం తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు జాతీయ స్థాయిలోనే ఓ సమగ్ర చట్టం అవసరమనే…
తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సైబర్ నెరగాళ్లతోపాటు సోషల్ మీడియాలో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సోషల్ మీడియా కేంద్రంగా నేరాలకు పాల్పడితే హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ద్వారా…
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.