Smriti Mandhana: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈరోజు ( డిసెంబర్ 7న) సంచలన ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే, గత కొంత కాలంగా నా వ్యక్తిగతం జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన అవసరం ఉంది.. నా పెళ్లి రద్దు అయిందని క్లారిటీ ఇస్తున్నా.. ఇక, ఈ విషయాన్ని ఇంతటితో అందరు వదిలేయండి.. దయచేసి మా ఇరు కుటుంబాల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాను.. ప్రస్తుతం నా దృష్టి మొత్తం క్రికెట్‌పైనే ఉంటుంది.. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా ముందున్న ప్రధాన లక్ష్యమని ఇన్‌స్టా స్టోరీలో స్మృతి మంధాన రాసుకొచ్చింది.
Read Also: Goa Fire Accident : నైట్ క్లబ్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ సీరియస్ !
పలాష్ ముచ్ఛల్ ఏం అన్నాడంటే?..
ఇక, స్మృతి మంధానతో తన బంధం ముగిసిందని మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్ ధ్రువీకరించాడు. తాము విడిపోవడానికి నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. అయితే, నా వ్యక్తిగత సంబంధం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాను.. నా జీవితంలో ముందుకు కొనసాగాలని నిర్ణయించుకున్నా.. తప్పుడువార్తలను ప్రజలు అంత సులభంగా నమ్మడం చూసి చాలా బాధేసింది.. ఇది నా జీవితంలో అత్యంత కష్ట కాలం అని కొనియాడాడు. కానీ, ఈ కఠిన పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు వస్తాను అనే నమ్మకం ఉందని పలాష్ అన్నారు.
Read Also: Hindu Rate Of Growth: ‘‘హిందూ వృద్ధిరేటు’’పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.. అసలేంటి ఇది..
అయితే, ఆధారాలు లేని వార్తలను ప్రసారం చేసే ముందు.. ఏది నిజం, ఏది అబద్దమో ఆలోచించుకోవాలి అని ముచ్చల్ తెలిపారు. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇక, పలాష్ ముచ్చల్-స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23వ తేదీన జరగాల్సి ఉండగా.. ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో.. అతడ్ని హుటాహుటిన దవాఖానాకు తరలించారు. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు మంధాన తెలియజేసింది. అనంతరం పలాష్ ముచ్చల్ కూడా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.

Palash