‘అందాల నటుడు’ అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు నటభూషణ శోభన్ బాబు. ఆయన నటజీవితం కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు చిత్రసీమలో తారాపథం చేరుకోవడానికి దాదాపు పుష్కరకాలం ప్రయత్నం సాగించి, చివరకు అగ్రకథానాయకుల సరసన చోటు సంపాదించిన ఘనుడు నటభూషణ శోభన్ బాబు. ఇంతలా స్టార్ డమ్ కోసం తంటాలు పడ్డ మరో స్టార్ హీరో తెలుగునాట మనకు కనిపించరు.ఇద్దరు భామల మధ్య నలిగే పాత్రల్లో పలుమార్లు కనిపించి మురిపించిందీ ఆయనే. నుదుటిపై రింగుపడేలా హెయిర్…