Tragedy : జీవితంలోని విషాదం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. పుట్టింట్లో బంధువుల కార్యక్రమానికి వచ్చిన ఓ చిన్నారి, ఇంటి ముందు ఆడుకుంటూ విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య-లలిత దంపతుల పెద్ద కుమార్తె స్నేహాన్షి…
పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బోడ యశ్వంత్‌ను పాముకాటేసింది. స్కూల్ ప్రిన్సిపల్.. యశ్వంత్‌ను హుటాహుటిన కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం అదే పాఠశాలలో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. తాజా ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ ఈరోజు నిద్ర లేచేసరికి కాలుకు గాయమై.. దురదలు వచ్చాయి. అతడు విషయాన్ని…
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో వికాస్ దూబే (24) అనే వ్యక్తి మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఏదో ఒకసారో.. రెండుసార్లు కాదు.. 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు. దీంతో.. వికాస్ దూబే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దూబే గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు. కాగా.. జూన్ 2 నుంచి జూలై 6 మధ్య అతన్ని ఆరుసార్లు పాము…
Snake Bite: ప్రస్తుతం వర్షాకాలం సమయం కాబట్టి చాలా చోట్ల నీటి ప్రవాహనికి పాములు వాటి చోటు నుంచి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు తరలి వస్తుంటాయి. అలాంటి సమయంలో మనుషులకు పాముల నుంచి అనేక ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో పాములు మనుషులను కాటు వేయడం ద్వారా ఒక్కోసారి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించకపోవడంతో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే పాము కాటు వేసిన వెంటనే మనిషి చేయాల్సిన కొన్ని జాగ్రత్తలను ఓసారి తెలుసుకుందాం. Hyderabad…
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ యువకుడు తన పుట్టినరోజు నాడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఆ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.
యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఓ యువకుడిని నెల రోజుల్లోనే ఐదుసార్లు పాము కాటు వేసిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. కానీ చికిత్స తర్వాత ప్రతిసారీ యువకుడు కోలుకున్నాడు.
Snake Bite: రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని పాము కాటేసింది. ఈ ఘటన మధురై-గురువాయూర్ ప్యాసింజర్ రైలులో సోమవారం ఉదయం జరిగింది. దీంతో మదురైకి చెందిన కార్తీ(23) అనే బాధితుడిని ఎట్టుమనూర్ స్టేషన్‌లో మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.