Snake Bite: ప్రస్తుతం వర్షాకాలం సమయం కాబట్టి చాలా చోట్ల నీటి ప్రవాహనికి పాములు వాటి చోటు నుంచి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు తరలి వస్తుంటాయి. అలాంటి సమయంలో మనుషులకు పాముల నుంచి అనేక ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో పాములు మనుషులను కాటు వేయడం ద్వారా ఒక్కోసారి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించకపోవడంతో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే పాము కాటు వేసిన వెంటనే మనిషి చేయాల్సిన కొన్ని జాగ్రత్తలను ఓసారి తెలుసుకుందాం.
Hyderabad Metro: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పనులకు శ్రీకారం..
ఎవరికైనా పాము కరిచిన తర్వాత అత్యంత కీలకమైన దశ ” ప్రశాంతంగా ఉండడమే “. పాము కరిచిందని ఎక్కువగా భయాందోళనకు గురి అయితే అది హార్ట్ బీట్ రేట్ పెంచడానికి తోడ్పడుతుంది. దీంతో శరీరంలో చేరిన విషయం మరింత వేగంగా శరీరం మొత్తం చేరడానికి తోడ్పడుతుంది. కాబట్టి లోతైన శ్వాస తీసుకుని వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత పాము ఎక్కడైతే కాటు వేసిందో అక్కడ సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుండు పై భాగంలో ఏదైనా విషం ఉంటే గనక అది తొలగించడానికి సహాయపడుతుంది.
Fake Ginger Garlic Paste: పెరుగుతున్న నకిలీ ఉత్పత్తులు.. 7.3 టన్నుల అల్లం పేస్ట్ స్వాధీనం
ఆ తర్వాత పాము కాటు వేసిన భాగానికి కాస్త పైన, కింద ప్రాంతాలలో గట్టిగా ఒక బట్ట కట్టడం ద్వారా విషం శరీరంలోని మిగతా భాగాలకు కాస్త నిదానంగా వెళుతుంది. దీంతో ప్రమాద స్థాయి కొద్దివరకు తగ్గించవచ్చు. ఇక అలాగే వీలైనంత త్వరగా పాము కరిచిన వ్యక్తికి వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. వీలైతే ఆసుపత్రికి ముందుగానే విషయం అందించి పాము కాటేసిన వ్యక్తి అక్కడి చేరుకునే లోపే అక్కడ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే విధంగా చూసుకోవాలి. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాము కాటు వేసిన దాని నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.