Telangana: “పాముకి పాలు పోసి పెంచినా.. అది విశ్వాసం మరచి పాలుపోసిన వాడినే కాటేస్తుంది” అని ఓ సామెత వినే ఉంటారు.. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది.. నాగదేవత అంటూ దైవంగా బావించి.. ఏళ్ల తరబడి ఇంట్లో పుట్టకు పూజలు చేస్తూ వస్తోంది ఓ వృద్ధురాలు.. అయితే, ఆ పుట్ట నుంచి వచ్చిన నాగుపాము.. ఆ వృద్ధురాలిని కాటువేసింది.. ఎంతో భక్తి విశ్వాసంతో ఉన్న ఆమె.. అంతా నా శివయ్యే చూసుకుంటాడు.. అని చెప్పింది.. కానీ, శివయ్య కరుణించలేదేమో.. ఆ వృద్ధురాలు కన్నుమూసిన ఘటన నిర్మల్ జిల్లాలో సంచనలంగా మారింది.. అయితే, దైవంగా భావించిన ఆ పాముకు మాత్రం.. వారు ఎలాంటి హాని తలపెట్టకుండా.. అడవుల్లో వదిలేశారు..
Read Also: Olympics: “ముద్దు” వివాదంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు.. క్రీడా మంత్రి, మక్రాన్ కిస్‌పై రగడ..
నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ అనే 65 ఏళ్లు వృద్ధురాలు.. అంగన్‌వాడీలో ఆయాగా పనిచేస్తూ వచ్చారు.. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తే ఉన్నారు.. ముప్పది ఏళ్లకు పైగా అంగన్‌వాడీ ఆయాగా పనిచేసిన గంగవ్వ.. ఈ మధ్యే పదవి విరమణ పొందారు.. అయితే, తమ ఇంట్లో పుట్ట ఉండడంతో.. గత ఇరవై ఏళ్లుకు పైగానే నిత్యం శుద్ది చేసి పూజలు చేస్తూ వచ్చేది గంగవ్వ.. ఇక, మంగళవారం రోజు కూడా ఉదయమే నిద్ర లేచిన గంగవ్వ.. ఇళ్లు శుద్ధి చేసింది.. ఆ తర్వాత పుట్ట చుట్టూ మట్టి నేలను అలకడం ప్రారంభించింది.. ఆ సమయంలో అకస్మాత్తుగా పుట్ట నుంచి బయటకు వచ్చిన నాగుపాము.. గంగవ్వ చేతిపై కాటు వేసింది. పుట్టను ఎల్లమ్మగా.. నాగుపామును దైవంగా భావించే గంగవ్వ.. నా దైవమే నన్ను కాటు వేసింది.. నాకు ఏమీ జరగదు.. అంతా నా తండ్రి శివయ్యే (శివుడు) చూసుకుంటాడంటూ.. తన పనిలో పడిపోయింది.. కానీ, కాసేపటికి మరోసారి పాము వచ్చి గంగవ్వను మళ్లీ కాటువేయడంతో ఖంగుతింది..
Read Also: Minister Parthasarathy: అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటాం..
మరోవైపు.. ఆమె శరీరంలో అప్పటికే విషం ఎక్కడంతో.. తనపై ప్రభావం చూపడం మొదలు కావడంతో.. తనకు ఏదో అవుతోంది.. కళ్లు తిరుగుతున్నాయంటూ.. సమీపంలో ఉన్నవారికి తెలియజేసింది గంగవ్వ.. వెంటనే వారు పాము కాటుకు వైద్యం చేసే నాటు వైధ్యుడిని సంప్రదించారు.. ఆ పరిస్థితిని గమనించిన నాటు వైద్యుడు.. తన నుంచి కాదంటూ చెప్పడంతో.. ఆ వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కానీ, అప్పటికే గంగవ్వ ప్రాణాలు విడిచింది.. ఇక, గంగవ్వను నాటు వేసిన నాగపాము పాత్రం.. ఆమె ఇంట్లో ఉన్న పుట్టలోనే తిష్టవేసింది.. దీంతో.. ఆ పుట్టపై వలను కప్పి పాము బయటకు వెళ్లకుండా చూశారు.. ఆ పామును ఎట్టకేలకు స్నేక్ క్యాచర్స్ వచ్చి పట్టుకున్నాడు.. అతడిపైకి కూడా బుసుల కొడుతూ కాటే వేసేందుకు ప్రయత్నించింది.. మరోవైపు.. గంగవ్వను కాటువేసిన పామును చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్థులు తరలివచ్చారు.. ఆమె ప్రాణాలు తీసిన పామును కూడా కొట్టిచంపాలని కోరారు.. కానీ, గంగవ్వ కుటుంబ సభ్యుల కొరిక మేరకు .. ఆ పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు స్నేక్ క్యాచర్స్.. అయితే, దైవంగా పూజించిన పామే.. కాటు వేయడంతో.. గంగవ్వ ప్రాణాలు విడిచిన ఘటన మాత్రం స్థానికంగా సంచలనంగా మారింది..