భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్స్‌లు బాదడంతో ప్రపంచ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లే లీ రికార్డును అధిగమించింది.
అత్యధిక సిక్సర్ల రికార్డు:
మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటివరకు లిజెల్ లీ పేరుపై ఉంది. లిజెల్ లీ 2017లో 28 సిక్సర్లు బాదింది. ఆ రికార్డును స్మృతి మంధాన బద్దలు కొట్టింది. 2025లో స్మృతి ఇప్పటికే 29వ సిక్సర్‌లు బాదింది. ప్రపంచకప్ 2025 ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో డియాండ్రా డాటిన్ (21), క్లోయ్ ట్రయాన్ (21), చామరి ఆటపట్టు (21)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచకప్‌లో మూడవ సెంచరీ:
న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధాన 88 బంతుల్లో సెంచరీని చేరుకుంది. 2025 ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున ఇదే మొదటి సెంచరీ. ప్రపంచకప్‌లో మంధానకు ఇది మూడవ సెంచరీ. మంధాన 2017, 2022 ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసింది. ఇక మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మెగ్ లానింగ్ పేరుపై ఉంది. వన్డేల్లో లానింగ్ 15 సెంచరీలు చేసింది. వన్డేల్లో మంధాన 14 సెంచరీలు చేసింది. లానింగ్ ప్రపంచ రికార్డును సమం చేయడానికి మంధాన ఒక సెంచరీ దూరంలో ఉంది.
Also Read: KCR: రౌడీ షీటర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!
తజ్మిన్ బ్రిట్స్ రికార్డు బ్రేక్:
స్మృతి మంధాన ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఈ ఇయర్‌లో స్మృతి ఐదవ సెంచరీలు బాదింది. దాంతో తజ్మిన్ బ్రిట్స్ రికార్డును సమం చేసింది. 2025లో తజ్మిన్ కూడా ఐదు శతకాలు బాదింది. 2024 క్యాలెండర్ ఇయర్‌లో మంధాన నాలుగు సెంచరీలు చేసింది.