ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నాయి. కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయాన్ని కాస్త పక్కనపెట్టి నిద్రపోయిన తరువాత ఆపోజీషన్ ను బట్టి మీరు ఎలాంటి వారో నిర్ణయించవచ్చు. అదేంటి చేయిచూసి జాతకం చెబుతారు. ఎలావుండాలో తెలుపుతారు. అలాంటిది నిద్ర భంగిమలోకూడా ఎలాంటి వారో తెలుసుకోవచ్చా.. అనుకుంటున్నారు కదా. సరే ఒకసారి మీ నిద్రభంగిమలకు అర్థమేంటో ఇది చదివితే మీకే…
సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే…
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్‌ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే..…
రాత్రిపూట కొంతమంది సరిగ్గా నిద్రపోరు. మొబైల్ లేదా టీవీ చూస్తూ లేటుగా నిద్రపోతుంటారు. మళ్లీ ఉదయాన్నే లేచి తమ పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటి వారికి కంటి నిండా నిద్ర ఉండదు. అయితే ఇలాంటి అలవాటు భవిష్యత్‌లో జీవక్రియలపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివారు పగలు నిద్రపోవాలని ఆలోచిస్తుంటారు. కానీ పగటి నిద్రకు, రాత్రి నిద్రకు చాలా తేడా ఉంది. ఎందుకంటే రోజంతా కష్టపడి అలసిపోయిన శరీరానికి రాత్రిపూట…