ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ పిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 36 సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. “తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. కానీ, తాను…
Harish Rao : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు భారీగా డబ్బు వెచ్చించారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు రూ.90 కోట్లు ఖర్చు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందజేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు…
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ…