KTR : తెలంగాణ అభివృద్ధికి రేవంత్ ఏం చేశాడు?
- సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ విమర్శలు
- మంత్రివర్గ విస్తరణ చేయలేని అసమర్థత అని కేటీఆర్ ఎద్దేవా
- ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 36 సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
“తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. కానీ, తాను మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాడు,” అని విమర్శించారు. “నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ యాదొస్తోంది” అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లడం తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై న్యాయ కమిషన్ డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. అంతకుముందు సుంకిశాలా, పెద్దవాగు ప్రమాదాల సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.
ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్‌లను డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
“ప్రభుత్వం సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలి. కేంద్ర సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయాన్ని తీసుకుని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Mahashivratri 2025: శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది?
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!