తెలంగాణ మాదకద్రవ్యాలకు నిలయంగా మారిందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేశామని చెప్పి.. విచారణ విషయంలో బ్లాక్ మెయిల్ గా వ్యవహరించింది తప్పితే దోషులను శిక్షించాలనే చిత్త శుద్ధి లేదన్నారు. సీఎస్ గా సోమేశ్ కుమార్ ఒక్క క్షణం కూడా బాధ్యతల్లో కొనసాగే హక్కు లేదు. ఐదేళ్ల కాలంలో మద్యం ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.
https://ntvtelugu.com/etela-rajender-hopes-bjp-rule-in-telangana/
ప్రతి బార్ కు,పబ్బుకు అనుసంధానంగా డ్రగ్స్ సప్లైర్స్ ఉన్నారు. రాష్ట్రమంతా మద్యం, బెల్టు దుకాణాలు అడ్డుగోలుగా వెలిశాయి. 140 పబ్బులు అధికారికంగా హైదరాబాద్ లో ఉన్నాయి. ఆబ్కారీ శాఖ కమిషనరే దీనికి పాత్రధారి, సూత్రధారి. రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రజల కష్టార్జితాన్ని మద్యం రూపంలో సర్కార్ దోచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎక్సైజ్ కమిషనర్ ను తొలగించాలన్నారు.
సమ్మక్క సారక్క, యాదాద్రి పర్యటనలో గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వలేదు. మహిళా కాబట్టే గవర్నర్ ను గౌరవించడం లేదు. గవర్నర్ బీజేపీ నాయకురాలని మంత్రులు ఆరోపించడం సిగ్గు చేటు. కేసీఆర్ రాజకీయ దుర్భుద్ధి అర్ధమవుతుంది. ముఖ్యమంత్రి తక్షణమే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలి. గవర్నర్ ని విమర్శించేముందు కేటీఆర్ తన పరిధిని మర్చిపోవద్దన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.