పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడిలో దాదాపు 11 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడింది.