ఎస్ ఆర్ హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కు చుక్కలు చూపించాడు. 6వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రాణా పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్ లో 6 బౌండరీలు కొట్టాడు. అందులో రెండు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్ లో ఏకంగా ఉమ్రాన్ మాలిక్ 28 పరుగులు సమర్పించుకున్నాడు.