నటుడు వినోద్ నువ్వుల ఆధ్వర్యంలో నడుస్తున్న వినోద్ ఫిల్మ్ అకాడమీ దినదిన ప్రవర్ధమానమై మరింత ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత కృష్ణాజిల్లా లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాడమీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే…