ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఏచూరి కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని చిరు ట్వీట్ చేశారు. ప్రజలకు చేసిన సేవ, దేశం పట్ల ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.…