సిరివెన్నెల పేరులో సీతారాముడున్నా, ఆయన మనసులో మాత్రం కైలాసవాసుడే కొలువై ఉన్నాడని చెప్పకతప్పదు. నుదుట త్రిపుండ్రాలు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ కవిత్వం పలికించేవారు సీతారామశాస్త్రి. సందర్భం ఏదైనా సరే, అలవోకగా పదబంధాలు పేర్చేవారు. తన కెరీర్ లో శివునిపై పలు పాటలు పలికించి పులకింప చేశారు సీతారామశాస్త్రి. ‘సిరివెన్నెల’లోనే “ఆది భిక్షువు వాడినేది కోరేది… బూడిదిచ్చేవాడినేది అడిగేది…” అంటూ నిందాస్తుతితో శివునిపై ఆయన పలికించిన గీతం ఈ నాటికీ భక్తకోటిని పులకింప చేస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి…