Sirivennela: సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలో నిత్యం జీవించే ఉంటారు.
సిరివెన్నెల సీతారామారాశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ఆయన పాటల పూదోటలో విహరించని మనిషి ఉండడు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాహిత్యం ఎప్పుడూ మన మధ్యనే ఉండేలా తానా ఒక గొప్ప నిర్ణయం తీసుకొంది. సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేందుకు తానా సంకల్పించింది. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాదు శిల్పకళావేదికలో “సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి – 1” పుస్తకావిష్కరణ వేడుక…