Sirivennela: సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలో నిత్యం జీవించే ఉంటారు.
ముప్పై సంవత్సరాల వయసులో చేంబోలు సీతారామశాస్త్రి… ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అయ్యారు. ఆ తర్వాత ముప్పై వసంతాలకు ‘పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. గత యేడాది నవంబర్ 30న కన్నుమూసే వరకూ ఆయన పాటతోనే ప్రయాణించారు. పాటనే పలవరించారు. తెలుగు సినిమా పాటకు సాహితీ గౌరవాన్ని కలిగించిన సీతారామశాస్త్రి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో అభిమానం. మే 20 ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టిన రోజు. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో తానా ప్రపంచ సాహిత్య వేదిక…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 24వ తేదీ కిమ్స్ హాస్పిటల్ లో చేరిన ‘సిరివెన్నెల’ సీతా రామశాస్త్రి నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే ఈ సమయంలో హాస్పిటల్ లో వైద్యానికి అయిన ఖర్చులన్నంటినీ ఏపీ ప్రభుత్వం భరిస్తుందని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ…