టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ (2024) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక ప్రాత పోషించాడు. మరోవైపు గతేడాది టెస్టుల్లో స్వదేశం, విదేశం అని…