వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Singur Project: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఏడాది తర్వాత సింగూరు ప్రాజెక్టులోకి వరద రావడంతో పూర్తిగా నిండడంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.