ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్ట్ 15న గ్రాండ్ ఫినాలే ఉండవచ్చని అంటున్నారు. అయితే, ఈ సారి ఎపిసోడ్ లో అతిథులుగా వెటరన్ మ్యూజీషియన్ బప్పీ లహరి, డైరెక్టర్ ఒమంగ్ కుమార్ పాల్గొంటున్నారు. ఇక లెటెస్ట్ ప్రోమోలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మేరీ కామ్’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ రూపొందించిన ఒమంగ్ కుమార్… షణ్ముఖని ఆకాశానికి ఎత్తేశాడు! ఆమె సింగింగ్ అద్భుతం అంటూ పొగడ్తలు కురిపించాడు.…