సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,830 కోట్ల రికార్డు టర్నోవర్‌ను నమోదు చేసింది.
సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది యాజమాన్యం.. రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం చేసుకుంది… ఎస్బీఐలో ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది… ఈ మేరకు సింగరేణి – ఎస్బీఐ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది… ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.20…
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సింగరేణి కాలరీస్ సంస్థ. ఏటా ఉద్యోగుల విషయంలో తీసుకునే శ్రద్ధతో పాటు సామాజిక బాధ్యతలోనూ సింగరేణి ముందుంది. తాజాగా సింగరేణి సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్‌ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా సోలార్…
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)ని ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సింగరేణి ఉద్యోగుల పోరాటంలో రాష్ట్ర నాయకులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన బొగ్గు గనులు తెలంగాణకు పెద్ద ఆస్తులని ఆయన అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ మండిపడ్డారు. నేరుగా సింగరేణికి బొగ్గు గనులు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే 1వ గనీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనను గోప్యంగా ఉంచారు అధికారులు. కెటికె 1 గని లో ఫస్ట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు పైన రూప్ గోడలు కూలి మీద పడ్డాయి. దీంతో కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం ఘటనలో ఒకరికి కాలు పైన నుండి దూసుకెళ్లిన ఎస్.డి.ఎల్ వాహనం. దీంతో కాలి ఎముకలు విరిగిపోయాయి. కార్మికునికి స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో…
సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే కాగా.. గతేడాది కార్మికులకు 68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది.. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది.. తాజా నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) 72,500 చెల్లించాలని…
రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షానికి పలు చోట్ల రహదారులు దెబ్బతినగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇక…