Tata Motors: పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఏప్రిల్ 1 నుంచే అమలు…
- టాటా మోటార్స్ కార్లు కొనే వారికి బిగ్ షాక్..
- ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న కార్ల ధరలు..
- స్టీల్, అల్యుమినియం ముడి పదర్థాల ధరలు పెరగడమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా మోటార్స్ కార్లు కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తన పెట్రోల్ , డీజిల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. సగటున 0.5 శాతం మేర ధరలు పెరగనున్నాయి. అయితే.. మీరు ఎంచుకునే కారు మోడల్ , వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపులో మార్పులు ఉండవచ్చు. అంటే కొన్ని కార్లపై తక్కువగా, మరికొన్నింటిపై కొంచెం ఎక్కువగా ప్రభావం ఉండవచ్చు. కేవలం పెట్రోల్, డీజిల్ (ICE) వాహనాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.
Also Read:Ration Card Holders: తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త.. జూన్ 2 నుంచే ప్రారంభం..
Also Read
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?
కార్లు తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల (స్టీల్, అల్యూమినియం వంటివి) ధరలు పెరగడం, రవాణా ఖర్చులు ఎక్కువ కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ అదనపు భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఇతర కంపెనీలతో పోటీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులపై మరీ ఎక్కువ భారం పడకుండా చాలా తక్కువ మొత్తంలోనే ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది.
ఏ ఏ కార్లపై ప్రభావం ఉంటుంది..?
టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ మోడల్స్ అయిన హ్యాచ్‌బ్యాక్, సెడాన్ , ఎస్‌యూవీ (SUV) విభాగాల్లోని అన్ని పెట్రోల్, డీజిల్ కార్లకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. మీరు మార్చి నెలాఖరులోపు కారు బుక్ చేసుకుంటే పాత ధరలకే పొందే అవకాశం ఉండవచ్చు.
తాజావార్తలు
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!