ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఓ విడియో విడుదల చేసిన ఆమె.. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇంత కాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు
సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు ఎందుకు? అని ప్రశ్నించారు. ఒక ఎస్సీ మహిళను కాబట్టే అంత చిన్న చూపా...? అని నిలదీశారు. ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ.? సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోంది.. మా కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా.. తమకు నీరు రాకుండా కొంతమంది సీఎం వద్ద పంచాయితీలు పెట్టే స్టేజ్ కి వెళ్ళింది…
TDP vs TDP: అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ ద్విసభ్య కమిటీ మెంబర్లు తన తండ్రిని దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బండారు శ్రావణి. నిన్న మర్తాడు గ్రామంలో యువగళం క్యాంప్ సెట్ దగ్గర బండారు శ్రావణి.. ముంటి మడుగు కేశవ రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో తన తండ్రి బండారు రవికుమార్ ను దూషించి దాడి చేశారంటూ ద్విసభ్య కమిటీ సభ్యుడు సోదరుడు శ్రీనివాసరెడ్డిపై శ్రావణి…
ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రస్తుతం శింగనమల టీడీపీ పరిణామాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఇంఛార్జ్ ఉండగానే వచ్చిన టుమెన్ కమిటీకి.. రెండు మండలాలను టచ్ చేయాలంటే ధైర్యం సరిపోవడం లేదట. ఆ మండలాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే జేసీ బ్రదర్స్ పర్మిషన్ తీసుకోవాలట. దానిపైనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ..! శింగనమలలో టీడీపీ టు మెన్ కమిటీ బలప్రదర్శన..! అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో తలెత్తిన రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదు. రాష్ట్రంలో ఎక్కడా…
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు పొలం దారి విషయానికి సంబంధించి వార్తలు వచ్చాయి. పొలం మధ్యలో దారి వేస్తున్నారని, తాము నష్టపోతున్నామని ఆ రైతు కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గ్రహించారు. 29 ఏళ్ళుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించారు. ఒక బలహీనుడికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం..ఊరు మొత్తం నిస్సహాయమై దీన్ని భరిస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే ముందు నిలబడ్డారు. న్యాయం వైపు ధర్మం…