కోలీవుడ్ హీరో శింబును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శింబు తాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ “మానాడు”. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన “మానాడు” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, సురేష్ కామచ్చి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో “ది లూప్” పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈరోజు చెన్నైలో ఉదయం 5 గంటలకు గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో బెనిఫిట్…
కోలీవుడ్ హీరో శింబు రాబోయే సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మానాడు’. ఈ చిత్రం నవంబర్ 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. తన ప్రసంగంలో శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చవలసి వచ్చింది. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి…
తమిళ హీరో శింబు తాజా చిత్రం ‘మానాడు’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ ను విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్య పూర్తి చేశాడు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్…
కోలీవుడ్ నటుడు శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మానాడు’.. తెలుగులో ‘ది లూప్’ పేరుతో వస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ముగిసింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశారు. దీపావళి సందర్బంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు ట్రైలర్ లో ప్రకటించారు. శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య,…
2021 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాలలో ‘మానాడు’ ఒకటి. దర్శకుడు వెంకట్ ప్రభు శింబుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ కామట్చి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తవ్వగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ…
తమిళ హీరో శింబుకు ఊరట కల్పించింది నిర్మాతల మండలి. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుండి వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కొంతమంది నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయన గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకూ చేరుకొని అక్కడ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారి తీసింది. గతంలో శింబు ప్రధాన పాత్రలో “అన్బాధవన్ అసరదావన్ అడంగాదవన్” అనే సినిమా సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మైఖేల్ రాయప్పన్…
శింబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పొలిటికల్ డ్రామా మూవీ ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా నిర్మాత సురేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే, మిగతా అన్ని చిత్రాల్లాగే శింబు, కళ్యాణి ప్రియదర్శన్ స్టారర్ ‘మానాడు’ కూడా అనేక వాయిదాలు పడింది గత సంవత్సర కాలంగా. లాక్ డౌన్ వల్ల శింబుకి అగచాట్లు తప్పలేదు. అయితే, 2020 జూలై 10న మొదలైన సినిమా 2021 జూలై 10న ముగిసింది! సేమ్ డేట్ తో ప్రారంభమై సేమ్…
గౌతమ్ మెనన్ లాంటి దర్శకుడు, శింబు లాంటి హీరో, ఆపైన ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడు… ఓ సినిమాకి ఇంత కంటే ఇంకా పెద్ద అట్రాక్షన్స్ ఏం కావాలి? వీరు ముగ్గురు కలసి పని చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా గత రెండు చిత్రాల రెస్పాన్స్ చూసిన వారికి ఎస్టీఆర్, జీవీఎం, ఏఆర్ఆర్ కాంబినేషన్ అంటే ఏంటో ఇప్పటికే ఐడియా ఉంటుంది! శింబుతో గతంలో గౌతమ్ మెనన్ ‘విన్నయ్ తాండి వరువాయా, అచ్చం యెన్బదు…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమాటోగ్రఫీ, జోహన్ అబ్రహం ఎడిటింగ్ చేస్తున్నారు. ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మతి అజగన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను…
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి తండ్రి లానే సకల కళావల్లభుడు అని పించుకున్నాడు శింబు. తండ్రి టి. రాజేందర్ అంత కాకపోయినా… కొన్ని శాఖలలో అయిన శింబు తన ప్రావీణ్యం బయటపెడుతూ ఉంటాడు. తాజాగా శింబు ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలో ఇన్ వాల్వ్ అయ్యాడు. సంగీత దర్శకుడిగా ఎ. కె. ప్రియన్ ను పరిచయం చేస్తూ, యువన్ శంకర్ రాజా తన యు1 రికార్డ్స్ బ్యానర్ లో మిత్రులతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నాడు. దీని…