కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అయితే, ప్యాండమిక్ సినిమాని డిలే చేస్తోంది. లాక్ డౌన్ వల్ల ఇంకా కొంత భాగం షూటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిపోయాయి. అయితే, ఆ మధ్య రంజాన్ సందర్భంగా తొలి సింగిల్ ని విడుదల చేద్దామనుకున్నారు ‘మానాడు’ మూవీ దర్శకనిర్మాతలు. కానీ, సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు తల్లి అకాల మరణం పాలవటంతో రంజాన్ వేళ ఫస్ట్ సాంగ్ రాలేదు.…
తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటించిన ‘ఈశ్వరన్’ ఈ యేడాది సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైంది. అనివార్య కారణాలతో తెలుగు వర్షన్ మాత్రం వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాతం సాధించలేదు. దాంతో శింబు కొత్త సినిమాల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. శింబు ప్రస్తుతం ‘మానాడు’లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిన ‘మహా’…
హీరోగా కంటే వివాదాలతోనే ఎక్కువగా పేరు సంపాదించాడు తమిళ నటుడు శింబు. ప్రత్యేకించి ప్రేమ వ్యవహారాలకు ఇతగాడు పెట్టింది పేరు. అందుకే కెరీర్ లో వెనకబడ్డాడు శింబు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ సినిమాలో నటిస్తున్నాడు శింబు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాచి తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.…