నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ…