Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
- కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
- డీకే శివకుమార్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించండి: జైన సన్యాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డీకే శివ కుమార్- సిద్ధరామయ్య మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. అయితే, దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సైతం రెండున్నరేళ్లు ఒకరు ఆ తర్వాత మరోకరు పదవీ తీసుకునేలా ఒప్పించారు. దీంతో ప్రస్తుతం డీకే శివ కుమార్ మనస్సులోని మాటలను బహిరంగంగా వ్యక్తం చేశాడు ఓ జైన సన్యాసి. సోమవారం హుబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
Read Also: Kanaka Durga Temple: దుర్గగుడి ప్రధాన అర్చకులు మృతి!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇక, ఆ జైన సన్యాసి మాటలకు ప్రతిస్పందిస్తూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ఇలా అన్నారు.. మీరు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్పగలను?.. ఆయన చెప్పేది నేను నియంత్రించలేను.. ఎందుకంటే, అది అతని కోరిక అన్నారు. నాకు ఏం కావాలో అన్నీ నా పార్టీ నిర్ణయిస్తుంది.. నాకు పార్టీ ముఖ్యం దాని ఆదేశాల ప్రకారం పని చేస్తా.. నేను ఏ పోస్ట్ కోసం వెతకాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే, నిన్న బెళగావిలో కాంగ్రెస్ సదస్సు సందర్భంగా డీకే శివకుమార్ మద్దతుదారుల బల ప్రదర్శన చేశారు. కొప్పల్, హోసపేట, బళ్లారి, చిత్రదుర్గ్ సహా వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం కోసం ర్యాలీగా అతడి చిత్రపటాలను పట్టుకుని నినాదాలు చేశారు.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
అలాగే, డీకే శివ కుమార్ ను కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన అభిమానులు కోరారు. డీకేకు సీఎం పదవీ ఇవ్వకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్థిరతను ఎదుర్కొంటుందని పార్టీలోని కొందరు మద్దతుదారులు హెచ్చరిస్తున్నారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ స్పందించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై ఊహాగానాలు అణిచివేసేందుకు ప్రయత్నించారు.. కాంగ్రెస్ పార్టీ కోసం మేము అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం.. ఎవర్ని నియమించాలి.. ఎప్పుడూ తొలగించాలో హైకమాండ్ తెలుసని ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!