ఏదైనా ఆపదలో ఉన్నారంటే డయల్ 100.. ఏదైనా సమస్య వచ్చిందంటే డయల్ 100.. ఎవరినుంచైనా రక్షణ కావాలన్నా డయల్ 100.. అలా డయల్ 100కు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.. అయితే, డయల్ 100కు వచ్చే కాల్స్‌పై కూడా కొందరు పోలీసు అధికారులు సరిగా స్పందించడం లేదు.. దీంతో, ఓ ఎస్ఐ, కానిస్టేబుల్‌పై వేటు పడింది… చిత్తూరు జిల్లా సోమల పోలీసుస్టేషన్ లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిచారంటూ ఎస్సై లక్ష్మీకాంత్‌ను వీఆర్‌కు పంపించారు జిల్లా ఎస్పీ రిశాంత్…